Eetala | మాట తప్పేది సీఎం కేసీఆర్.. మాట నిలబెట్టుకునేది ప్రధాని మోదీ…
– తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారులో బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ రిజర్వేషన్
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్
– వెనుకబడిన వర్గాల వారు సీఎంకు పనికిరారా..? : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడ, మాజీ రాజ్య సభ్యుడు గరికపాటి మోహన్ రావు
– ములుగులో బీజేపీ అభ్యర్థి డాక్టర్ ప్రహ్లాద్ తరఫున విజయసంకల్ప సభ
తెలంగాణ జ్యోతి ,నవంబర్ 22, ములుగు ప్రతినిధి : నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు పదేళ్ల కాలంలో ఒరగబెట్టిందేమీ లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పే మనిషని, కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ మాట నిలబెట్టుకొని అమలు చేసే మనిషి అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రచార కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ములుగులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన, మాజీ మంత్రి చందూలాల్ కొడుకు, బీజేపీ అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ రాజ్య సభ సభ్యులు గరికపాటి మోహన్ రావుతో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ తండ్రి చందూలాల్ పట్టుబడితే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టడని పేర్కొన్నారు. యువకుడైన ప్రహ్లాద్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.9వేలు ఎరువుల సబ్సిడీ రూపంలో ఇస్తోందన్నారు. బీజేపీ మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ లతో సమానమని, అలాంటి ప్రజలకు మేలుచేసే అంశాలతో బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిందన్నారు. సీఎం కేసీఆర్ వరి కొనుగోలులో తరుగు పేరుతో కోతలు పెట్టి, అకాల వర్షాలకు దెబ్బతింటే ధరలు తగ్గించి కొంటే పీఎం మోదీ మాత్రం రూ.2200ల నుంచి రూ.3100లకు ఇస్తా అని ప్రకటించడం రైతులకు వరం అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే గింజ కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. మహిళలకు ఏడాదికి 4గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, రూ.4200ల కోట్ల వడ్డీలేని రుణాలను అందజేస్తామన్నారు. వెనుకబడిన వర్గాలకు ముఖ్యంగా విద్య, వైద్యం ఇబ్బందికరంగా ఉందన్నారు. అందుకుగాను బీజేపీ ప్రభుత్వంలో పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీషు బోధన అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ రైతులు చనిపోతే బీమా ద్వారా రూ.5లక్షలు చెల్లిస్తామని చెబుతున్నారని, కానీ ప్రధాని మోదీ మాత్రం రైతు చనిపోకుండా కుటుంబంతో సంతోషంగా ఉండేందుకు లాభసాటిగా వ్యవసాయం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను కలిసేందుకు సమయం ఇవ్వరని, అలాంటిది ప్రజలను ఎలా కలుస్తారని ఆరోపించారు. ప్రజల వద్దకు రాని సీఎం అవసరమా, 54శాతం జనాభా ప్రకారం బీసీ ముఖ్యమంత్రి కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో 4కోట్ల మందికి ఇండ్లు కట్టించామని, గృహలక్ష్మీ ద్వారా ఇచ్చిన రూ.3లక్షల పత్రాలు చెల్లనివేనని ఈటల విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వందలమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. 17పేపర్లు లీకేజీలు చేసి యువతలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ములుగు ప్రాంత ప్రజలు సమ్మక్క, సారలమ్మల వారసులని, అమ్మవార్ల పేరుమీద పీఎం మోదీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసి రూ.900కోట్లు మంజూరు చేశారన్నారు. యునెస్కో గుర్తింపుకు కేంద్రం కృషిచేసిందని, మేడారం పండుగకు జాతీయ హోదా కృషి చేస్తామన్నారు. ములుగులో బీజేపీ అభ్యర్థి గెలిస్తే బస్ డిపో ఏర్పాటు చేస్తామని, ఎన్నో ఏళ్ల కళగా ఉన్న రాజుపేటను మండలంగా చేస్తామని, ఆర్టీసీని బలోపేతం చేస్తామన్నారు.
– బీసీలు ముఖ్యమంత్రులు కావొద్దా..? : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు
తెలంగాణ ప్రాంతంలో 54శాతంగా ఉన్న బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కావొద్దని మాజీ రాజ్య సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర కోర్ కమిటీ సమావేశంలో తాను ఈ విషయాన్ని ఆరునెలల క్రితమే చర్చించానని పేర్కొన్నారు. కాంగ్రస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఓసీలు ముఖ్యమంత్రి అవుతారని, బీసీ సీఎం కావాలంటే బీజపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ములుగు నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన చందూలాల్ కొడుకు డాక్టర్ ప్రహ్లాద్ ఈసారి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారని, టీడీపీ శ్రేణులు ఒక అవకశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకడిన వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 30ఏళ్లుగా తన జాతికోసం కొట్లాడిన మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందు ఉంచారని, ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ములుగులో గిరిజన యూనివర్సిటీతోపాటు రానున్న రోజుల్లో సాంకేతిక పరమైన యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ములుగులో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆలస్యం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ములుగుకు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు సర్వే జరుగుతోందని, ములుగు జిల్లాలో పస్రా మణుగూరు వరకు రైలు నడువనుందన్నారు. అందుకుగాను రూ.9కోట్లను బడ్జెట్ లో కేటాయించినట్లు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసేదే చెబుతుందని గరికపాటి వెల్లడించారు.
– ఒక్క అవకాశం ఇవ్వండి పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తా : బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ప్రహ్లాద్
కొంతమంది దుష్ప్రచారాలతో 2018లో మా నాన్న చందూలాల్ ను ఓడించారని, ములుగుకు 1989లోనే ఆర్డీవో కార్యాలయం తీసుకువచ్చి ప్రజలకు పాలన చేరువచేసిన ఘనత అజ్మీర చందూలాల్ ది అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోర్టు, మార్కెట్ యార్డు ఇలా ప్రతీ గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి పనుల్లో శిలాఫలకాలపై ఆయన పేరు ఉంటుందన్నారు. 2018లో గెలిచిన పాలకులు ములుగును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ శంకుస్థాపన చేసిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.5కోట్లతో ప్రారంభించిన మినీ స్టేడియంలను ఎందుకు పూర్తిచేయలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. మా నాన్న బతికుండగా రూ.150కోట్లు మంగపేట వద్ద ఉన్న గోదావరి కరకట్ట కోసం నిధులు మంజూరు చేస్తే కాంట్రాక్టర్లతో పనులు చేయించలేని స్థితిలో పాలకులు ఉన్నారని ప్రహ్లాద్ విమర్శించారు. గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు, ఇలా అన్ని మండలాల్లో చందూలాల్ చేసిన అభివృద్ధి తప్ప మరొకరు చేసిందేమీ లేదని, ఆయన కుమారునిగా బరిలో ఉన్న తనకు ఒక్క అవకాశం ఇస్తే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని ప్రహ్లాద్ స్పష్టం చేశారు. ములుగుకు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ఇచ్చింది లేదని ఆరోపించారు. ములుగును జిల్లాగా చేసేందుకు చందూలాల్ కృషి మరువలేనిదన్నారు. 2018ఎన్నికల హామీగా ఇచ్చిన మల్లంపల్లిని 2023వరకు ఎందుకు చేయలేదని, ఇప్పటికీ మల్లంపల్లి మండల ఏర్పాటుకు అడ్డంకులు ఉన్నాయన్నారు. ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవచేసే అవకాశాన్ని కల్పించాలని, ములుగు ఏజెన్సీలోని గిరిజనులు, ఆదివాసీ సోదరులకు అండగా ఉంటానని, వారి హక్కులకు భంగం కలుగకుండా గిరిజనేతరుల సమస్యలు కూడా పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని, ఆయుష్మాన్ భారత్ తో రూ.10లక్షల వరకు ఉచిత కార్పోరేట్ వైద్యం తీసుకునే అవకాశం ఉందన్నారు. స్వయానా తాను డాక్టర్ని అని సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీ తో రూ.1.5లక్షల వైద్యం మాత్రమే చేసుకోవచ్చన్నారు. ఫసల్ బీమాతో రైతుల పంట నష్టానికి పరిహారం దక్కుతుందని, రైతు బీమాతో రైతులు చనిపోతే డబ్బులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పోతే డబ్బులు ఇస్తామంటోందని, ప్రదాని మోదీ రైతులను కుటుంబాలతో సుఖంగా బతికేలా వ్యవసాయాన్ని లాభసాటి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న బీజేపీని ఆదరించాలని, తనను గెలిపించుకొని సేవచేసే భాగ్యం కల్పించాలని డాక్టర్ ప్రహ్లాద్ ప్రజలకు విజ్క్షప్తి చేశారు. విజయ సంకల్ప సభకు సుమారు 10వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి, సరోత్తం రెడ్డి, రాష్ట్ర మేకల గొర్రెల పెంపకం దారుల సంఘం మాజీ చైర్మన్ కన్నబోయిన రాజయ్య యాదవ్, బిజెపి ఎన్నికల నిర్వహణ అధికారి నాంపల్లి శ్రీనివాస్, బిజెపి జిల్లా ఎన్నికల ఇంచార్జ్ వెంకటరమణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి నాయక్, భూక్యా రాజు నాయక్, భూక్య జవహర్లాల్ నాయక్, వాంకుడోత్ స్వరూప, జిల్లా ఉపాధ్యక్షులు అడప బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, యువ మోర్చ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, ఇమ్మడి రాకేష్ యాదవ్, డి.వాసుదేవరెడ్డి, సిరికొండ బలరాం నియోజకవర్గ కన్వీనర్, నరహరి వేణుగోపాల్ రెడ్డి, వెంకట రమణ, భూక్యా రాజునాయక్, భూక్యా జవహర్ లాల్, అజ్మీర కృష్ణవేణి
తక్కల్లపల్లి దేవేందర్ రావు, సూరపనేని సురేశ్, గాజుల కృష్ణ ప్రదాన కార్యదర్శి నగరపు రమేష్, అడప బిక్షపతి, ఉపాధ్యక్షుడు
ఏనుగు రవీందర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, కర్ర సాంబశివడు
శ్రీలమంతుల రవింద్రాచారి, శివగాని స్వప్న, జినుకల కృష్ణాకర్ రావు, కొత్త సురేందర్, గట్ల శ్రీనివాస్ రెడ్డి, కేశెట్టి కుటుంబరావు, గట్టు మహేందర్, ఆవుల ప్రశాంత్ రెడ్డి, ములుగు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు జిల్లా మండల పదాధికారులు పాల్గొన్నారు.