చదువుతోనే పేదలకు భవిష్యత్తు

చదువుతోనే పేదలకు భవిష్యత్తు

చదువుతోనే పేదలకు భవిష్యత్తు

– పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నూతన ఉత్సాహం

ఏటూరునాగారం, జూన్ 26, తెలంగాణ జ్యోతి : చదువు మాత్రమే పేదలను గొప్ప స్థాయికి చేర్చగలదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దయానంద్ అన్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భాన్ని సేవా కార్యక్రమంగా మార్చుకుంటూ ఏటూరునాగారం అంబేద్కర్ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఎగ్జాం ప్యాడ్లు, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా మాత్రమే పేదల భవిష్యత్తులో మార్పు సాధ్యమని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సభ్యులు సయ్యద్ వహీద్, మహమ్మద్ ఖాజా పాషా, మహమ్మద్ మున్నా, జూపక పవన్, కుడుదుల సంతోష్, రెడ్డి రామ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment