జిల్లా విద్యాశాఖ అధికారిగా దురిశెట్టి చంద్రకళ
ములుగు ప్రతినిధి, జూలై1, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా విద్యాశాఖ అధికారిగా దురిశెట్టి చంద్రకళను నియామకం చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీఈవోగా పనిచేసిన పనిచేసిన జి.పాణిని లంచం తీసుకున్న కేసులో జూన్ 16న ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకోవడంతో ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హనుమకొండలో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న డి.వాసంతికి బాధ్యతలు అప్పగించగా ఆమె విధులలో చేరక పోవడంతో ప్రస్తుతం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న దురిశెట్టి చంద్రకళకు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు.