కాటారంలో దుర్గాదేవి శోభాయాత్ర

కాటారంలో దుర్గాదేవి శోభాయాత్ర

కాటారంలో దుర్గాదేవి శోభాయాత్ర

కాటారం, అక్టోబర్ 03, తెలంగాణజ్యోతి : కాటారం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. శుక్రవారం రాత్రి శ్రీ దుర్గా దేవి అమ్మవారిని గారేపల్లి, కాటారం పురవీధుల్లో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ అమ్మవారికి స్వాగతిస్తూ శోభా యాత్రలో ముందు నిలిచారు. శ్రీ దుర్గా దేవి కి ఇంటింటి నుండి మంగళ హారతులతో వచ్చి టెంకాయ కొట్టి మొక్కులు సమర్పించారు. ధన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ దేవాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ దేవి విగ్రహాన్ని గ్రామంలోని పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు కాలేశ్వరం త్రివేణి సంగమ తీరంలో నిమజ్జనం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment