నూగూరు అంగన్‌వాడీ కేంద్రంలో మందుబాబుల వీరంగం
– పాల ప్యాకెట్లు, సామాన్లు ధ్వంసం
వెంకటాపురం, ఆగస్టు 31, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు పంచాయతీ పరిధి లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆదివారం మందుబాబులు, ఆకతాయిలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. కేంద్ర భవనం కిటికీ ఊసలు వంచి లోపలికి ప్రవేశించి సుమారు 40 లీటర్ల పాల ప్యాకెట్లు చింపి, పాలు బయట పారబోసి ఖాళీ ప్యాకెట్లను తొక్కేశారు. అలాగే, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఇవ్వాల్సిన పోషకాహార సామగ్రిని ధ్వంసం చేసి చిందరవందర చేశారు. ఆదివారం సెలవు కావడంతో కేంద్రం మూసి ఉండగా, ఈ సంఘటన జరిగింది. అంగన్‌వాడీ టీచర్ తగరం వెంకటరమణ ఈ విషయాన్ని వెంటనే వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ముత్తమ్మ, సెక్టార్ సూపర్వైజర్‌లకు తెలియ జేశారు. వారి సూచన మేరకు వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈసంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.