వైద్య సేవల్లో ప్రతిభకు డాక్టర్ రవీందర్‌కు అవార్డు
ములుగు, ఫిబ్రవరి4, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర సందర్భంగా వైద్య సేవల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ రవీందర్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందజేశారు. భక్తుల అపార రద్దీ మధ్య కూడా అంకితభావంతో వైద్య సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు కీలకంగా వ్యవహరించినందుకు ఈ గౌరవం దక్కింది. జాతర కాలంలో ఎదురైన అత్యవసర ఘటనలను సమర్థంగా నిర్వహించి, నిరంతర సేవలతో ఆరోగ్య శాఖ ప్రతిష్టను నిలబెట్టిన డాక్టర్ రవీందర్‌ను అధికారులు, వైద్య సిబ్బంది అభినందించారు. ఈ అవార్డు తనకు మరింత సేవాభావంతో ప్రజలకు సేవ చేయడానికి ప్రోత్సాహంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.






