డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన
భద్రత, వసతులపై అధికారుల దృష్టి
భూపాలపల్లి, జూలై 10, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి పట్టణంలోని వేషాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్, పురపాలక సంఘం ప్రత్యేకాధికారి ఎల్. విజయలక్ష్మి లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె టౌన్ ప్లానింగ్ అధికారి పి. సునీల్ కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ జి. నవీన్ లతో కలిసి లబ్ధిదారుల అవసరాల ను సమీక్షించారు. ఇంటి పరిసరాల్లో నీటి సరఫరా, విద్యుత్, రోడ్డు, శానిటేషన్ వంటి మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలన జరిపారు. లబ్ధిదారులు అధికారులకు తమ వసతులపైన పలు విజ్ఞప్తులు చేశారు.వాటిపై స్పందించినఅధికారులు, అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన చేపడతామని హామీ ఇచ్చారు. పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ పథకం సద్వినియోగానికి ఇది ఒక మంచి అడుగు అవుతుందని అధికారులు పేర్కొన్నారు.