రైతు పోరాటాన్ని రాజకీయ రంగుతో ముడిపెట్టవద్దు : జీడి బాబురావు
తెలంగాణ జ్యోతి, సెప్టెంబర్7, తాడ్వాయి : రైతు సమస్యల ను రాజకీయ రంగుతో ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతు న్నాయని, అలాంటి చర్యలను సహించబోమని గిరిజనేతరుల సంఘం రాష్ట్ర నాయకుడు జీడి బాబురావు హెచ్చరిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజారాజ్యం లో రైతు నష్టపరిహార సాధన సమితి నిజమైన రైతుల తరఫున పోరాటం చేస్తోందని, కానీ దానిని వ్యతిరేకిస్తూ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం రంగు పులుముతున్నారని బాబురావు ఆరోపించారు.మహాజాతర సమయంలో వేలాది మంది రైతులు పంట నష్టపోతున్నారని చెప్పినా, వారికి సహాయం చేయాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్య లపై ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తే, దానిని రాజకీయాలుగా చూడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలకు ఈ పోరాటానికి ఎలాంటి సంబంధం లేదని జీడి బాబురావు పేర్కొన్నారు.