గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలం విరాళం
– స్థల దాతను అభినందించి, సన్మానించిన వి ఆర్ కె పురం పంచాయతీ ప్రజలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే భవనం నిర్మాణం కొరకు స్థలం ప్రధాన సమస్యగా మారింది. ఈ మేరకు స్థల సేకరణ నిమిత్తమై మంగళవారం అధికారుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన నిమ్మల కొండలరావు నాయుడు అనే ప్రముఖ రైతు చొక్కాల మునుసుబు కుటుంబం వారసుడు పంచాయతీ భవన నిర్మాణం కొరకు స్థలం ఇచ్చేందుకు ముందు కు వచ్చారు. కీర్తిశేషులు స్వర్గీయ తమ తల్లిదండ్రులు పేరు నా పంచాయతీ భవన నిర్మాణానికి తన సొంత పట్టా కలిగిన భూమిలో స్థలాన్ని ఐదు సెంట్లు పైగా ఇస్తున్నట్లు సంబంధిత పత్రాలు పై సంతకాలు చేసి పంచాయతీ, ప్రజల సమక్షంలో స్వాధీన పరుస్తూ సంబంధిత పత్రాలను అధికారులకు అందజే శారు. కాగా గ్రామపంచాయతీ ప్రజలందరూ నిమ్మల కొండ లరావుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పట్టు శాలువలతో సత్కరిం చారు. అనంతరం గ్రామపంచాయతీ భవనానికి భూమి ఎక్కడ ఇస్తున్నారో అక్కడికి ఉన్నత అధికారులను తీసుకువెళ్లి, వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ ప్రజల సమక్షంలో రెండు గుంటల భూమిని ఎక్కడ ఇస్తున్నారో అందరి సమక్షంలో చూపించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ తహసిల్దార్ మహేం దర్, వ్యవసాయ అధికారి నవీన్, గ్రామపంచాయతీ సెక్రటరీ రాజేందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి డర్రా దామోదర్, మాజీ సర్పంచ్ పూనెం శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జల్లిగంపల కళాధర్ నాయుడు,డర్ర రవి, మాజీ ఉప సర్పంచ్ శివరాణి, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, రాము, మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.