ములుగులో ఘనంగా దొడ్డి కొమరయ్య 99వ జయంతి
ములుగు, ఏప్రిల్ 3, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా సంక్షేమ భవన్లో శ్రీ దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డా. కె. కొమురయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభానికి, భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహోన్నత ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం నాయకులు కంకల రమేష్, కోరే అరవింద్, వెంకట్ రావ్, బీసీ వెల్ఫేర్ శాఖా ఉద్యోగులు మొగిళి, సరిత, రేణుక, సాడలు, ఈ. ప్రతాప్, జి. గోపాల్ చారి, రత్నాకర్, నాలుగవ తరగతి ఉద్యోగులు, విలేకరులు పాల్గొన్నారు.









