పేరూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శబరిష్

Written by telangana jyothi

Published on:

పేరూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శబరిష్

– మావోయిస్టుల కదలికలపై మరింతగా నిఘా పెంచాలి

– గంజాయి రవాణాని పూర్తి స్తాయిలో అడ్డుకట్ట వేయాలి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లాలో పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా పేరూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి డా.శబరిష్ తనిఖీ చేసారు. స్టేషన్ రిసెప్షన్ లో గల రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమో దు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని, పెండింగ్ కేసు లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని ని సిబ్బంది యొక్క నైపుణ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ పేరూరు పోలీస్ స్టేషన్ చుట్టు పక్కల పరిసర ప్రాంతాలు చతిస్గడ్ తో అంతర్రాష్ట్ర సరిహద్దు ను కలిగి ఉన్నందున మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని, గంజాయి రవాణా పై ఎక్కువగా దృష్టి సారించా లని, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నం దున ప్రజల భద్రత కై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదు అందగానే విచారణ చేపట్టాలని ఎఫ్ ఐ ఆర్ నమోదు, కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ తెలియజేశారు. అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణ ను పరిశీలించి వాస్తవ స్థితి గతులను అడిగి తెలుసుకు న్నా రు. సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది భాద్య తతో కూడుకున్నదని, క్రమశిక్షనతో ఉద్యోగం చేయాల ని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుం టానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి డి సి ఆర్ బి రాములు, సిఐ వెంకటాపురం కుమార్, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now