శ్రీరామ జన్మభూమి పూజిత అక్షితల వితరణ

Written by telangana jyothi

Published on:

శ్రీరామ జన్మభూమి పూజిత అక్షితల వితరణ

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : శ్రీరామ జన్మభూమి పూజి త అక్షితల వితరణ జనవరి ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు చిన్నబోయిన పల్లెలోని ప్రతి కుటుంబానికి శ్రీ రామ పూజిత అక్షిత లను వితరణ చేయనున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి వరంగ ల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందాల చందర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా చిన్న బోయపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చందర్ బాబు మాట్లాడుతూ 22 జనవరి 2024 సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని (గ్రౌండ్ ఫ్లోర్) గర్భగుడిలో శ్రీ బాల రాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడు తున్నదన్నారు. ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుందని, ఆ రోజున మనం కూడా ప్రాణప్రతిష్ఠ శుభముహూర్త సమయానికి ముందే ఉ.11.00 గం.ల నుండి మ.01.00 గం.ల మధ్య మనకు దగ్గరలో ఉన్న ఏదేని దేవాలయం లో చుట్టుప్రక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి, భజన కీర్తన లు నిర్వహిద్దామన్నారు. టెలివిజన్, డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షిద్దామన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా 108 సార్లు జపించాలన్నారు. ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగిం చి, ఇంటిని విద్యుత్తు దీపాలతో అలంకరించాలన్నారు. ఈ సమావే శంలో శ్రీరామ  తీర్థ  క్షేత్ర  ట్రస్ట్  జిల్లా సమితి  సభ్యులు,  తుమ్మ ప్రభాకర్ రెడ్డి , సామ మోహన్, రెడ్డి తిప్పనబోయిన రామకృష్ణ తుమ్మ సంజీవ రెడ్డి గుజేటి రాజశేఖర్ బి కిషన్, సుంకరి శ్రీనివాస్, కిరాణం శివప్రసాద్, వరప్రసాదులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tj news

2 thoughts on “శ్రీరామ జన్మభూమి పూజిత అక్షితల వితరణ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now