గుర్రేవుల పాఠశాలలలో నోట్స్ బుక్స్, బ్యాగుల పంపిణీ

గుర్రేవుల పాఠశాలలలో నోట్స్ బుక్స్, బ్యాగుల పంపిణీ

గుర్రేవుల పాఠశాలలలో నోట్స్ బుక్స్, బ్యాగుల పంపిణీ

– సినాప్సిస్ సంస్థ అభినందనీయ సేవలు

కన్నాయిగూడెం, జూలై 19, తెలంగాణ జ్యోతి : సినాప్సిస్ సంస్థ ఆర్థిక సహకారంతో యునైటెడ్ వే హైదరాబాద్ భాగస్వామ్యంతో కన్నాయిగూడెం మండలంలోని గుర్రేవుల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు నోట్స్ బుక్స్, బ్యాగులు, స్టేషనరీ సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ములుగు జిల్లా కోఆర్డినేటర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా తహసీల్దార్ సర్వర్ హాజరయ్యారు.  సంస్థ సేవలను ప్రశంసిస్తూ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వంగ పాపయ్య, ఓదెల వేణుగోపాల్, ఉపాధ్యాయులు జమున, శ్యాం సుందర్, కవిత, రవీందర్, రమేష్, పీఈటీ కుమారస్వామి, సీఆర్పీ రమేష్ లు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నర్సమ్మ, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment