గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాల పంపిణీ
వెంకటాపురం, సెప్టెంబర్ 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలను శనివారం కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ప్రత్యేక చొరవతో ఐటీడీఏ కోటా కింద ఇళ్లు మంజూరయ్యాయి. తొలి మంజూరి పత్రాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం రాత్రి పొద్దుపోయే వరకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి కాంగ్రెస్ నాయకులు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొసైటీ చైర్మన్ చిడెం మోహన్రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, నాయకులు బాలసాని వేణు, జిల్లా నాయకులు మన్యం సునీల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, సొసైటీ డైరెక్టర్ పల్నాటి ప్రకాష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టిం సాయి, అధికార ప్రతినిధి శ్రీరాముల రమేష్, నాయకులు గుండమళ్ళ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.