మున్సిపల్ కార్మికులకు ఉచిత కిట్ల పంపిణీ
షాద్ నగర్, ఆగస్టు 2, తెలంగాణ జ్యోతి : 100 రోజుల ప్రణాళికలో భాగంగా షాద్ నగర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు ఉచిత కిట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అదే విధంగా, 9వ వార్డులో రూ.40 లక్షల వ్యయంతో మల్లికార్జున్ కాలనీలో అభివృద్ధి చేయనున్న పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకల చెన్నయ్య, నాయకులు అగ్గనూర్ బస్వం, చెంది తిరుపతి రెడ్డి, రఘు నాయక్, వెంకట్ రాంరెడ్డి, మహ్మద్ ఇబ్రహీం, అందే మోహన్ ముదిరాజ్, శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, ఖదీర్, వాసు తదితరులు పాల్గొన్నారు.