మూగజీవాల వైద్యానికి వెటర్నరీ వైద్యులు, సిబ్బంది దూరం

Written by telangana jyothi

Updated on:

మూగజీవాల వైద్యానికి వెటర్నరీ వైద్యులు, సిబ్బంది దూరం

  • ఇబ్బంది పడుతున్న పెంపకం దారులు, పాడి రైతులు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : పశు సంపద, మూగజీవాలకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పశువైద్యశాలలను తోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా సీజన్లలో వచ్చే పశు వ్యాధులకు ముందుస్తు, టీకాలు ఇతర వ్యాధి నిరోధక వైద్య సేవలు అందించేందుకు, పశు వైద్యాధి కారులతోపాటు, సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. అయితే పశు వైద్యాధికారులు సిబ్బంది రైతులకు అందుబాటులో లేకపోవడంతో, పాడి పరిశ్రమ, కోళ్ళు పెంపకం , మూగజీవాల పెంపకాలపై ఆధారపడ్డ పెంపకందారులు,పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఏడిచర్లపల్లి జి.పి. పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో గొర్రెలు, మేకలతో పాటు పాడి పశువులు ఆవులు,గేదెలు ,కోళ్ళు అనేక వ్యాధులతో బాధపడుతున్న ,వాజేడు మండల కేంద్రం కు చెందిన పశు వైద్య సిబ్బంది,పశు వైద్యాధికారులు ఈ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని, దీంతో తాము ప్రభుత్వపరంగా సౌకర్యాలు కల్పించిన పశుసంవర్ధక శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కళ్ళముందే పాడిపశువులు, గేదలు గొర్రెలు మేకలు,కోళ్లు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విశేషమేమంటే వాజేడు మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్యశాల పని దినాలలో సైతం తాళాలు వేసి ఉంటుందని, సిబ్బంది పశువైద్యాధికారి అందుబాటులో ఉండరని, ఎప్పుడు మీటింగ్ అంటూ ప్రాథమిక పశు వైద్యశాల మూసివేసి ఉంటుందని తెలిపారు. తాము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పాడి పరిశ్రమ గొర్రెల,మేకలు పెంపకం దారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో పశు సంపాదకు పూర్తిస్థాఇ వ్ ద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని, నెలకు వేలాది రూపాయలు జీతం పొందుతున్న వైద్యులు, రాజ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన వెటర్నరీ డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం మూగజీవాలకు పశువులకు ఆవులకు గేదెలకు వైద్య సేవలు అందించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని, ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మీడియా ప్రతినిధులకు సోమవారం తమ గోడును విన్నవించుకున్నారు.ములుగు జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొని రైతు లకు న్యాయం చేయాలని, గొర్రెలు, మేకల పెంపకం దారులు, పాడి పరిశ్రమ రైతులు పత్రికా ముఖంగా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సత్యవతి మృతి పట్ల సంతాపం. 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now