రైతు భరోసా డబ్బుల గొడవ.. కత్తిపోటుతో ఇద్దరికి గాయాలు

On: March 28, 2026 10:54 AM

రైతు భరోసా డబ్బుల గొడవ.. కత్తిపోటుతో ఇద్దరికి గాయాలు

రైతు భరోసా డబ్బుల గొడవ.. కత్తిపోటుతో ఇద్దరికి గాయాలు

ములుగు, మార్చి 28, తెలంగాణ జ్యోతి: రైతు భరోసా డబ్బుల కోసం జరిగిన కుటుంబ వివాదం రక్తపాతానికి దారి తీసింది. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లికి వచ్చిన రైతు భరోసా డబ్బుల విషయంలో కుమార్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గొడవ తీవ్రరూపం దాల్చగా అడ్డుకునేందుకు వచ్చిన సోదరుడు సతీశ్, మామ రమేశ్‌పై కుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలు కావడంతో సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!