వెంకటాపురం అడవుల్లో పర్యటించనున్న డీజీపీ శివధర్ రెడ్డి
– ఏరియల్ సర్వే : వెంకటాపురం కాఫీడ్ గ్రౌండ్లో విస్తృత ఏర్పాట్లు
వెంకటాపురం నూగూరు ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో పర్యటించనున్నారు. మావోయిస్టులపై కేంద్ర, రాష్ట్ర బలగాలు ఉక్కుపాదం మోపడంతో పలువురు ముఖ్య నేతలు లొంగుబాటు కాగా డీజీపీ నిర్వహిస్తున్న ఏరియల్ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు వెంకటాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాఫేడ్ గ్రౌండ్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. డీజీపీ ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం11 గంటలకు హెలిపాడ్ లో ఏరియల్ సర్వే చేసి వస్తారు. అనంతరం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భం గా ప్రముఖ ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల డాక్టర్లచే ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య పరీక్ష కేంద్రాన్ని డిజిపి ప్రారంభిస్తారు . తెలంగాణ రాష్ట్ర పోలీ స్ శా ఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” కార్యక్రమంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయని స్థానిక పోలీసులు తెలిపారు. వెంకటాపురం మండల పరిధిలోని ప్రజలందరూ ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో సహా హాజరై వైద్య సేవలను పొందడంతో పాటు అవగాహన కార్యక్రమాలను వినియోగించు కోవలసిందిగా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమాల అనంతరం డిజిపి శశిధర్ రెడ్డి కర్రిగుట్టలపై ఏర్పాటు చేసిన సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులు సందర్శించ నున్నట్లు సమాచారం. డిజిపి తో పాటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఐపీఎస్ అధికారులు వెంకటాపురంతో పాటు, కర్రే గుట్టలపై కూడా పర్యటిం చనున్నట్లు తెలిసింది.









