భూపాలపల్లి జిల్లాల్లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
కాటారం, అక్టోబర్1, తెలంగాణజ్యోతి : జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో సరస్వతి దేవి, శుభానంద్ దేవి అమ్మవారు తొమ్మిదవ రోజున మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయం లో ప్రతి రోజు హోమం నిర్వహించారు బుధవారం హోమం మహా పూర్ణాహుతి చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు గండేసిరి రమ- మధుసూదన్ ల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులకు తో నిర్మితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిదవ రోజు రోజులు శ్రీరాంభట్ల కృష్ణమోహన్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. దుర్గా దేవికి గాజుల మాలలతో చీర రూపంలో అలంకరించారు. కాటారం మండలంలోని గారేపల్లి గ్రామంలో లక్ష్మీ దేవర సన్నిధిలో ఏర్పాటుచేసిన దుర్గదేవి కాలిక మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చక్కెర పొంగలి,పాయసం, వడపప్పు తో పాటు మహిళలు వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. బుధవారం సాయంత్రం విశేష పూజలో ఆర్యవైశ్య సంఘం నాయకులు అనంతుల రమేష్ బాబు ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. శుక్రవారం రోజున దుర్గాదేవి నవరాత్రుల కార్యక్రమం ఉపవాస దీక్ష విరమణ, నాగబలి, దుర్గాదేవి శోభాయాత్ర గారేపల్లి పురవీధులలో ఉంటుందని కాలేశ్వరంలో నిమజ్జనం చేయనున్నట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్ తెలిపారు.