బిఆర్ఎస్ పాలనలో కుంటుపడిన అభివృద్ధి

బిఆర్ఎస్ పాలనలో కుంటుపడిన అభివృద్ధి

బిఆర్ఎస్ పాలనలో కుంటుపడిన అభివృద్ధి

బిఆర్ఎస్ పాలనలో కుంటుపడిన అభివృద్ధి

– ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, జులై 14, తెలంగాణ జ్యోతి : గతంలో బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, మహిళల సంక్షేమం పూర్తిగా పక్కన పెట్టినట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాటారం మండలంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల మార్కెటింగ్ సౌకర్యాలతో పాటు మహిళా సంఘాల ద్వారా దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఇది ఆరంభమని తెలిపారు. డివిజన్‌లో 3161 మహిళా సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తుండగా, వీటిలో 32070 మంది సభ్యులు ఉన్నారని, వీరికి ఇప్పటికే ₹36.34 లక్షల ప్రమాద భీమా, ₹30 లక్షల రుణ భీమా, ₹10.30 కోట్ల బ్యాంకు లింకేజీ, ₹69.03 లక్షల వడ్డీలేని రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. గత పదేళ్లలో పైసా కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వని బీఆర్‌ఎస్ పాలనతో పోల్చితే, ఇప్పటి ప్రభుత్వ పాలనలో మహిళలకు ఉపాధి అవకాశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రెడ్‌కో సంస్థ ద్వారా సోలార్ విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసి, సంఘాల ఆదాయాన్ని పెంచనున్నామని తెలిపారు. వారం రోజుల్లో 100 మంది మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాలు నిర్వహిం చేందుకు డీఆర్డీవోకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కి గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, 9 రోజుల్లో ₹9 వేల కోట్లు రైతు భరోసా, రేషన్ ద్వారా సన్నబియ్యం వంటి పథకాలతో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతోందని వివరిం చారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న 6 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున మొత్తం ₹30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలత, కార్యదర్శి రజిత పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment