బిఆర్ఎస్ పార్టీకి ఉప సర్పంచ్ రాజీనామా
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన కాటారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, మండల ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయిని శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన గ్రామంలో అధికార పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని నాయిని శ్రీనివాస్ అన్నారు. తన గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు, దళిత బంధు, గృహలక్ష్మి తదితర పథకాలను అందించడానికి తాను ప్రయత్నం చేస్తుండగా, కొంతమంది అనర్హులను లబ్ధిదారులు గా గుర్తిస్తున్నారని అన్నారు. అవినీతి, అన్యాయాలను సహించలేక తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శ్రీనివాస్ వివరించారు. రానున్న రోజుల్లో త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తానని నాయిని శ్రీనివాస్ పేర్కొన్నారు.