రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్రావు ఎంపిక పట్ల హర్షం
– జిల్లా కౌన్సిలర్ బొమ్మన భాస్కర్ రెడ్డి
మహాదేవపూర్, జులై 1, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా రాంచందర్రావు ఎంపికపై బీజేపీ జిల్లా కౌన్సిలర్ బొమ్మన భాస్కర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తూ రామచంద్ర రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావును బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి ఏబీవీపీ, సంగు పరివార్ క్షేత్రాలలో జాతీయవాదిగా పనిచేశారని పార్టీ శ్రేణులు వారి నాయకత్వంలో ముందుకెళ్తారని ఆశిస్తున్నా రని అన్నారు. రామచంద్రరావు నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో కాషాయం జండా రెపరెపలాడడం ఖాయం అని అన్నారు.