అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం
ఏటూరునాగారం, జూన్ 23, తెలంగాణ జ్యోతి : ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం ద్వారా డిగ్రీ మొదటి సంవత్సర ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రేణుక తెలియజేశారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతలు (ఓపెన్ ఇంటర్, రెండు సంవత్సరాల ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా) కలిగిన విద్యార్థులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవడానికి అర్హులని తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర ప్రోగ్రాములు అందుబాటులో ఉండగా, విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకునే వీలుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 13లోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 📞 94913 17887, 📞 85001 78217, 📞 70930 84347 నంబర్లలో సంప్రదించాలన్నారు.