షాక్ సర్క్యూట్‌తో మూగజీవాల మృతి
కన్నాయిగూడెం, జులై2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని చిట్యాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోడే నారాయణకు చెందిన రూ.60 వేలు విలువ చేసే దుక్కిటి ఎద్దు, సోడే రాకేష్‌కు చెందిన రూ.20 వేలు విలువ చేసే అవుదూడ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాయి. గ్రామంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌కు సంబంధించిన పెన్సింగ్‌కు షార్ట్ సర్క్యూట్ అవడంతో ఈ సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుక్కిటి ఎద్దుతోనే వ్యవసాయం చేసుకుని మా కుటుంబాన్ని పోషించేవాళ్లమని, ఇప్పుడు అది కోల్పోయిన తర్వాత జీవనం భారమై పోయిందంటూ బోరున విలపించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.