ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా దండు రమేష్
కాటారం, జులై 29, తెలంగాణ జ్యోతి : కాటారం సబ్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టుల నియామకం ను మంత్రి శ్రీధర్ బాబు చేపట్టారు. ఒక్కో మండలం నుండి ఒకరికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా దండు రమేష్ ను ప్రభుత్వం నియమిం చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన దండు రమేష్ 2016 వ సంవత్సరం నుండి జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (దళిత) విభాగం జిల్లా ఛైర్మన్ గా చేసిన సేవలకు గుర్తింపు లభించింది. వ్యాఖ్యాత, దాటిగా మాట్లాడుతూ దమ్మున్న నాయకునిగా ప్రతిపక్షాలను విమర్శలను గట్టిగా సమాధానం ఇవ్వడం ఇతని నైజం. 2016 వ సంవత్సరం నుండి జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (దళిత) విభాగం జిల్లా ఛైర్మన్ గా చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నియామకం జరిగింది. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క,రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబులు తన నియామకానికి కృషి చేసినందుకు దండు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.