ములుగులో బస్టాండ్ మరుగుదొడ్లు మూసివేతపై విమర్శలు

ములుగులో బస్టాండ్ మరుగుదొడ్లు మూసివేతపై విమర్శలు

ములుగులో బస్టాండ్ మరుగుదొడ్లు మూసివేతపై విమర్శలు

ములుగు, ఆగస్టు12, తెలంగాణ జ్యోతి : ములుగు పట్టణం లో కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో, బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు తాళాలు వేసి  మూయడంతో ప్రయాణికులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ములుగు జిల్లా అధ్యక్షులు గడ్డం భద్రయ్య విమర్శించారు. గత 15 రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆయన తెలిపారు. ప్రయాణికుల కోసం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను తక్షణం తెరవాలని, వాటర్ సౌకర్యం కల్పించడంతో పాటు వాటి నిర్వహణ కోసం ఒక వ్యక్తిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment