రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
వెంకటాపురం, ఆగస్టు12, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్ళపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు గాయపడగా వారిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.