రామప్ప హుండీల లెక్కింపు
ములుగు, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయంలో మేడారం జాతర, మహా శివరాత్రి జాతరల సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను ఈనెల 28న (గురువారం) దేవస్ధానం మండపం నందు విప్పి లెక్కించనున్నట్లు రామప్ప ఆలయ ఈవో శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.