గంజాయిపై కౌన్సిలింగ్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : గంజాయి నియంత్రణ లో భాగంగా గత కొంతకాలంగా కాటారం పరిధిలో వివిధ గంజాయి కేసుల్లో సంబంధం ఉన్న వారు, మరి కొంత మంది యువతకు మంగళవారం కాటారం ఎస్ఐ అభినవ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి గురించి ఎటువంటి సమాచారం అందిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.గ్రామా ల్లో యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. గంజాయి విక్రయించినా, సేవించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొంత మంది యువ కులపై షీట్స్ ఓపెన్ చేయబడ్డాయి. యువకులు గంజాయి అమ్మడం,సేవించడం చేయరాదని హితవు పలికారు. నిరంతరం గంజాయి పై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు.