ములుగు కళకు పట్టాభిషేకం
స్వర్ణనంది అందుకున్న భత్తుల ఉపేందర్
ములుగు, మార్చి 24, తెలంగాణ జ్యోతి: కళా మరియు సామాజిక రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు ఖమ్మంలో నిర్వహించిన స్వర్ణనంది ఉగాది పురస్కారాలలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు భత్తుల ఉపేందర్‌కు స్వర్ణనంది పురస్కారం లభించింది. N.S ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో మొగిలి గుణకర్వారి నిర్వహించిన ఈ సభలో, మిమిక్రీ ధ్వని అనుకరణ, బీట్ బాక్స్ డబ్బింగ్ వంటి ప్రత్యేక కళారూపాల ద్వారా అనేక సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య వంతం చేసినందుకు ఉపేందర్‌ను ఎంపిక చేశారు. ప్రముఖ సినీ దర్శకులు మరియు కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆయనకు స్వర్ణనంది పురస్కారం ప్రదానం చేశారు. పురస్కారం అందుకున్న అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ ఈ గౌరవాన్ని తన ములుగు జిల్లా కళా కుటుంబానికి అంకితం చేస్తున్నానని తెలిపారు. తనకు సహకరించిన కళాబంధువులు, మిత్రులు, గురువులు, అధికారులు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.









