ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం : మంత్రి సీతక్క

ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం : మంత్రి సీతక్క

ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం : మంత్రి సీతక్క

ఏటూరునాగారం, జులై 7, తెలంగాణ జ్యోతి : ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం చిన్నబోయినపల్లి గ్రామంలో రూ.55 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు, రూ.1.60 కోట్లు ఖర్చుతో ఎన్‌హెచ్ 163 నుంచి పెద్ద వెంకటాపూర్ వరకు బిటి రోడ్డు, షాపల్లిలో రూ.70 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వనమహోత్సవం కింద మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్థులు ముందుండాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment