గ్రంథాలయానికి భవనాన్ని నిర్మించండి
మహదేవపూర్, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల గ్రంధాలయానికి నూతనంగా భవనాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం మహదేవపూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు అడప రాజయ్య, ఠాకూర్ విక్రమ్ సింగ్ కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిశారు. ఎంపీని ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం మహాదేవపూర్ గ్రంధాలయ భవన నిర్మాణంతోపాటు విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.