వెంకటాపురంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 

వెంకటాపురంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురంలో కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిం చారు. మండల కేంద్రము లోని ఆర్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ఇంది రా గాంధీ విగ్రహం వద్ద 139వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భా వ దినోత్సవం ను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఎ సి యస్ ఛైర్మన్ , సీనియర్ నాయకులు చిడెం మోహన్ రావు మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ సభలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. గ్రామ సభలలో ఆరు గ్యారంటీల కు ధరఖాస్తులు ను మండల అధికారులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజల కు చెందిన ఏమైనా దరఖాస్తు లను ఫారం లను నింపడం లోని ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు క్రుషి చేయాలని కోరారు.పార్జీజెండా ఆవిష్కరణ కార్య క్రమంలో, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మన్యం సునీల్ జ్యోతి వెలి గించి ప్రారంభించారు.అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, బాలసాని శ్రీనివాస్, బాలసాని వేణు, బాలసాని మధుసూదన్ రావు, జలిగంపల కళా ధర్, రమేష్ , ఎంపీటీసీ సీతాదేవి, సరస్వతి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “వెంకటాపురంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ”

Leave a comment