Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

On: March 18, 2026 11:33 AM

గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

వెంకటాపురం, మార్చి18, తెలంగాణ జ్యోతి: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ పేర్కొన్నారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివారు బి.సి. మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని నేలరుపేట వీధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.15 లక్షల వ్యయంతో మంజూరైన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ సురిటి రాజేశ్వరి, ఉపసర్పంచ్ బొల్లి వెంకన్నతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడం సాంబశివరావు, సీనియర్ నాయకులు బాలసాని వేణు, గుండమల్ల కిరణ్, వార్డు సభ్యులు తాడేపల్లి రాఘవ కృష్ణ, మంచాల భూషణం, కాంట్రాక్టర్ బాలసాని మధు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!