స్పర్శ లెప్రసి ఆవేర్నెస్ పై సమావేశం

స్పర్శ లెప్రసి ఆవేర్నెస్ పై సమావేశం

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం స్పర్శ లెప్రసి అవేర్నెస్ క్యాంపియన్ సమావేశం ఏర్పాటు చేశారు. గాంధీ వర్ధంతి రోజు నుండి 15 రోజులు వరకు నిర్వహించే సర్వేలో ఆశాలు ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేసి స్పర్శ మచ్చలు ఉన్న వారిని గుర్తించి పీహెచ్సీకి రిఫర్ చేయనున్నారు. గ్రామ సమూహాల వద్ద గ్రామపంచాయతీ మీటింగ్స్ లలో కుష్టి వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తారు. కుష్టు వ్యాధి ఉన్నవారికి పూర్తి చికిత్స అందించే విధంగా గాంధీ  కలలుగన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టి వ్యాధి రహిత భారత దేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తామని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినవ్, హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత, హెల్త్ సూపర్వైజర్ రమణకుమారి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ ,భాస్కరరావు, ఏఎన్ఎంలు లతా మంజువాణి కవిత, సలోమి పుణ్యవతి, ఊర్మిళ, లక్ష్మి, సబిత, మరియు ఆశాలు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment