భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సత్యవతి మృతి పట్ల సంతాపం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం మాజీ శాసనసభ్యురాలు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందటం తో వెంకటాపురం బిజెపి నేతలు భద్రాచలం లో ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. వెంకటాపురం మండల పరిషత్ అధ్యక్షులు బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు చెరుకూరి సతీష్ కుమార్ ఎంపీటీసీ లక్ష్మీ శేఖర్, బిజెపి నాయకుడు అప్పాల రవి పలువురు నాయకులు సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి వార్త తెలిసిన వెంటనే భద్రాచలం వెళ్లి నివాళులర్పించారు. వెంకటాపురం మండల కేంద్రంలో బిజెపి నేతలు, సత్యావతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.