పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది

పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది

పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది

మాకు న్యాయం చేయండి సార్– బాధితుల విన్నవింపు

భూపాలపల్లి, జులై 10, తెలంగాణ జ్యోతి : ఇంటి పక్కన నివసించే వ్యక్తి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు జరుపుల గంగ, కిషన్ లు వాపోతున్నారు. బుధవారం కాకతీయ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ సమస్య వివరించారు. 20 ఏళ్ల క్రితం కారల్ మర్క్స్ కాలనీలో స్థిరపడిన తమ ఇంటి పక్కనున్న వ్యక్తి, తమ ఖాళీ స్థలంలో ఉన్న మిషన్ భగీరథ పైపులను కాల్చినట్టు తెలిపారు. అంతేకాకుండా, తమ మామిడి చెట్టును నరికి వేయడంతో అది పక్కింటి మీద పడింది. దీంతో తాము కారకులమని పోలీసుల నుండి వేధింపులకు గురవుతున్నా మన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని 100కు ఫిర్యాదు చేసినా పోలీసుల నిర్లక్ష్యమే ఎదురవుతోందన్నారు. స్పందనగా, స్థానిక ఎస్‌ఐ మాట్లాడుతూ నేడు పరామర్శించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment