ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీలు
తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం : మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మెహందీ, బైండల్ ఆర్ట్ కాంపిటీషన్స్ నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యా ర్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి రేణుక మాట్లా డుతూ అన్ని మతాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా భారత దేశ మత సామరస్యాన్ని,భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీ నర్ కనీఫ్ ఫాతిమా, నవీన్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త సిహెచ్ వెంకటయ్య, ఐక్యుఎసి కన్వీనర్ జ్యోతి, సంపత్, జీవవేణి, రమే ష్, మున్ని, విజయలక్ష్మి, లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.