గుమ్మడిదొడ్డిలో కమ్యూనిటీ కాంటాక్ట్
– గంజాయి కి యువత బానిస అవ్వద్దు
– చిన్నపిల్లలను పనిలో పెట్టకుంటే కఠిన చర్యలు తప్పవు
– ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు
వెంకటాపురం వాజేడు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో బుధవారం ఉదయం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిం చారు. గ్రామాల్లోని యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అవాటైతే బంగారు భవిష్యత్తు నాశనం చేసు కోకూడదని ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడారు తల్లి దండ్రులు తగిన జాగ్రత్త పిల్లలకు ఇవ్వాలంటూ అలాగే మైనార్టీ తీరని పిల్లలను ఎవరైనా కూడా పనుల్లో పెట్టు కోవద్దని ముఖ్యంగా రైతులు చత్తీస్గడ్ నుండి తీసుకువచ్చిన వ్యక్తుల్లో చిన్న పిల్లలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులని అన్నారు ఒకవేళ అలా ఏమైనా కనిపిస్తే పనిలో పెట్టుకున్న యజమానియానిపైన మరియు పనికి పంపించిన తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సివిల్ మరియు సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.