మేడే వేడుకలకు రండి..!
– ఏఎలీకు ఏఐటీయూసీ ఆహ్వానం
ములుగు, తెలంగాణ జ్యోతి : మే 1వ తేదీన ములుగు లో జరిగే మేడే కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సహయ కార్మిక శాఖ అధికారి వినోదను ఏఐటీయూసీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ మేడే వేడుకలను కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, రెండవ ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు గ్రామపంచాయతీ కార్మికులు, మిగితా అన్ని వర్గాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేశారు, పోరాడితేనే హక్కులు సంపాదించుకోవచ్చు నని, అన్నారు ఏ పాలకులు కూడా ఊరికే ఏమీ ఇవ్వరూ అన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏఐటియుసి జిల్లా నాయకులు ముత్యాల రాజు, ఎండి అంజద్ పాష, పెదకాసు వినోద్, కొత్త పెళ్లి శ్రీనివాస్, ఎనగందుల అనిల్,శివ తదితరులు పాల్గొన్నారు.