ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రండి

On: April 13, 2026 6:50 PM

ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రండి

ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రండి

కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ పిలుపు

ములుగు, ఏప్రిల్ 13, తెలంగాణ జ్యోతి: ఈనెల 18వ తేదీ శనివారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి హిందువు ఆత్మీయ బంధువుగా తరలి రావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం సెయింట్ ఆంటోనిస్ స్కూల్ ఆవరణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంజునాథపురం వద్ద జాతీయ రహదారి పక్కన ఈ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల నుంచి ప్రజలను సమాయత్తం చేస్తూ, ప్రతి వార్డు నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు నవధాన్యాలు, కరపత్రం, జెండా అందజేస్తూ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు ఎక్కువ భాగం వార్డుల్లో కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు ముక్కు సుబ్బారెడ్డి, భాష బోయిన మహేందర్, కంది జీవన్ రెడ్డి, వాంకుడోత్ జ్యోతి, మేకల సంపత్, పాడియా రవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!