ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

On: March 21, 2026 7:21 PM

ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, మార్చి 21, తెలంగాణ జ్యోతి: ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మసూరీలో ఉన్న లాల్ బహాదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక “డిజిటల్ రూపాంతరణ కోసం ఏఐ ఛాంపియన్స్ ప్రోగ్రామ్” శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. మార్చి 16 నుండి 20, 2026 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పరిపాలనలో కృత్రిమ మేధస్సు వినియోగం, ఆధునిక సాంకేతికతల ప్రయోజనాలు, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక సేవలందిం చడంలో డిజిటల్ పరిజ్ఞానం పాత్రపై సమగ్ర అవగాహన పొందారు. ఈ శిక్షణ ద్వారా జిల్లాలో డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానం లభించనున్నాయని, భవిష్యత్తులో పరిపాలనను వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన జిల్లా కలెక్టర్లలో ఒకరిగా ఈ శిక్షణలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన మరియు నాణ్యమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తానని స్పష్టం చేశారు. ఈసందర్భంగా అధికారులు కలెక్టర్ ను అభినందించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!