సన్న బియ్యం పంపిణీ పరిశీలించిన కలెక్టర్

సన్న బియ్యం పంపిణీ పరిశీలించిన కలెక్టర్

సన్న బియ్యం పంపిణీ పరిశీలించిన కలెక్టర్

కాటారం, తెలంగాణ జ్యోతి : సన్న బియ్యం ఎలా ఉన్నాయి? బాగున్నాయా? సక్రమంగా పంపిణీ చేస్తున్నారా.. మీరు తీసుకున్నారా.. తీసుకున్న బియ్యం వండుకుని తింటారా? ఏం ఏం చేస్తారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆహార భద్రతా కార్థు దారులను అడిగారు. గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపెళ్లి గ్రామంలో చౌక ధరల దుకాణం ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సన్న బియ్యం పంపిణీ పరిశీలించారు. రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకున్న లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు బియ్యం బాగున్నాయి వండుకొని తినండి ప్రభుత్వం పేద ప్రజల కోసం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు అనంతరం కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో సరిపోను సిబ్బంది లేరని ఖాళీలతో ఇబ్బందులు ఉన్నాయని ఎంపీడీవో రాజు కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, డిఎస్ఓ శ్రీనాథ్, కాటారం డిప్యూటీ తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో బాబు డీలర్ భారీ పాషా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment