బొమ్మన్ పాడ్ జెడ్పీ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్
నారాయణపేట, జూలై 30, తెలంగాణజ్యోతి : నారాయణపేట మండలంలోని బొమ్మన్ పాడ్ గ్రామంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తాపట్నా యక్ పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో ఎంత మంది విద్యార్థులకు ఆధార్ లింకేజీ పూర్తి అయిందని ఉపాధ్యాయుల ను అడిగి తెలుసుకున్నారు.ఎఫ్ ఏ 1 కంప్లీట్ అయిందా ? లేదా ? అని అడిగారు. సామాన్య, బయో సైన్స్ క్లాస్ లను పరిశీలించారు. ఖాన్ అకాడమీ ఫీజిక్స్ లు విద్యార్థులకు బోధిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం పదో తరగతిలో ఎంతమంది పాస్ అయ్యారని అడగగా 40 మందిలో 38 మంది విద్యార్థులు పాస్ అయ్యా రని ఉపాధ్యాయులు కలెక్టర్ కు తెలిపారు. ఈసారి పదో తరగతి లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్ధి ఒక గోల్ పెట్టుకోవాలని దానిని సాధించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. 9వ తరగతిలోని ఇంగ్లీష్ క్లాసును ఆమె పరిశీలించారు. విద్యార్థుల కు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.భోజనం మంచిగా ఉంటుందా?లేదా? అని విద్యార్థులను ప్రశ్నించగా బాగా ఉంటుందని విద్యార్థులు కలెక్టర్ కు తెలిపారు. మధ్యాహ్న భో జన పథకంలో ఫుడ్ కమిటీ చాలా కీలక పాత్ర పోషించాలని, తప్పని సరిగా కమిటీ సభ్యులు భోజనం తిని మంచిగా ఉందని నిర్ధారణ చేసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని ఆమె సూచించారు. రోజూవారీ మధ్యాహ్న భోజనం రుచి చూసి, టేస్ట్ రిజిస్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.