Cm Revanth | ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి నిర్వహణ : సీఎం

Written by telangana jyothi

Published on:

Cm Revanth | ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి నిర్వహణ : సీఎం

హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ప్రజా వాణిగా పిలవాలని సి.ఎం. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రజా వాణి ని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకా శం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తీగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now