చిట్యాల ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి 

చిట్యాల ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి 

చిట్యాల ఐలమ్మ వర్ధంతి, జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి 

కన్నాయిగూడెం,తెలంగాణజ్యోతి: మండలకేంద్రంలో వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిం చాలని మండల అధ్యక్షుడు పైడకుల సమ్మయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ గణేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్ సి 1773 (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తేదీ: 15-09-2022) ప్రకారం చిట్యాల ఐలమ్మ జయంతి, (సెప్టెంబర్ 26), వర్ధంతి (సెప్టెంబర్ 10) న వేడుకలను అధికారికంగా నిర్వహించాలని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. అందువల్ల మండల కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రమేష్, సాయి రాములు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment