గోల్డ్ మెడల్ సాధించిన చిన్నబోయినపల్లి ఆశ్రమ విద్యార్థి సందీప్

గోల్డ్ మెడల్ సాధించిన చిన్నబోయినపల్లి ఆశ్రమ విద్యార్థి సందీప్

గోల్డ్ మెడల్ సాధించిన చిన్నబోయినపల్లి ఆశ్రమ విద్యార్థి సందీప్

ఏటూరునాగారం, జూలై 29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో చిన్నబోయినపల్లి ఆశ్రమ హై స్కూల్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి ఏం. సందీప్ ప్రతిభా ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడు. 8 ఇయర్స్ వయో విభాగంలో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ బహుమతి గెలుచుకున్న సందీప్, ఆగస్టు 7, 8 తేదీలలో జనగాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా ఆశ్రమ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ వట్టం వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని తెలిపారు. గోల్డ్ మెడల్ గెలిచిన సందీప్‌ను ప్రధానోపాధ్యాయుడు రమేష్, డిప్యూటీ వార్డెన్ నరసింహులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment