మిర్చి పంటకు చట్టబద్ధత కల్పించాలి
– క్వింటా మిర్చికి 25 వేలు ఇవ్వాలి
– మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి.
వెంకటాపురం నూగూరు,తెలంగాణ జ్యోతి : కేంద్ర ప్రభుత్వం మిర్చి పంటకు చట్టబద్ధత కల్పించి క్వింటా మిర్చి పంటను 25 వేల రూపాయలకు కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపురం జరిగిన రైతు సమావేశం రైతు నేత చిట్టెం ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. మిర్చి రైతుల జిల్లా స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతం మిర్చి పంటకు ప్రసిద్ధి గావించిందన్నారు. మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన నష్టాలు చవిచూడాల్సి వస్తుంద న్నారు. గత సంవత్సరం నుండి మిర్చి పంటకు ధర ఎందుకు పడిపోతుంది, పరిష్కారం ఎవరు చూపాలి అని ప్రశ్నించారు. ఆహార పంటలలో మిర్చి పంటను కేంద్ర ప్రభుత్వం చేర్చలేదని వెంటనే ఆహార పంటల జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో పది దేశాల్లో మాత్రమే మిర్చి పంటను సాగు చేస్తున్నారని, అటువంటి పంటకు ధర కల్పించడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని ఆయన ఆరోపించారు. మిర్చి రైతులు చాలా ధైర్యంతో ఒకవైపు రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలు, మరోవైపు నల్లి, తెగుళ్లు, వాతావరణంలో వస్తున్న మార్పులతో యుద్ధాలు చేస్తూ స్థిరంగా లేని మార్కెట్లో మిర్చి సాగు చేయటం ఆశ మాసి పని కాదని అన్నారు. రాష్ట్రంలో సాగుకు లక్ష నుండి మూడు లక్షల వరకు పెట్టుబడులవుతున్నాయని కొద్దిమంది పురుగు మందుల వ్యాపారులు రేట్ల విషయంలో రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లలో దళారులు బస్తాకు రెండు నుంచి ఆరు రూపాయలు కాజేస్తున్నారని విమర్శించారు. ప్రతినిత్యం మన ప్రధానమంత్రి విదేశాలు తిరగడం ఆదాని అంబానీల కోసం ఒప్పందాలు చేసుకోవడం తప్ప, ఇతర దేశాల కు మిర్చి పంటను ఎగుమతి చేయించి అంశాన్ని పట్టించు కోవడంలేదని ఎదేవా చేశారు. బిజెపి మోడీ పాలలో 1.74 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రతి రోజు మన దేశంలో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన ఆందోళనకు గురి కావలసిన అంశమని అన్నారు. మిర్చి పంట సాగు ద్వారా ఉపాధి లభిస్తుందని విదేశీయ మారక ద్రవ్యం పెరుగు తుందని గుర్తు చేశారు. పొగాకు పసుపు బోర్డులు వలె రాష్ట్రంలో మిర్చి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కంపెనీ వ్యవసాయం, కాంట్రాక్టు వ్యవసా యాలు, ఐక్యతతో సంఘటితంతో తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న పత్తి వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి కేరళ ప్రభుత్వం తరహాలో ప్రైవేట్ అప్పులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా నాయకులు ఎండి గఫూర్, ఆగి రెడ్డి పార్టీ మండల కార్యదర్శి జ్ఞానం వాసు, సిఐటి జిల్లా అధ్యక్షులు ఎం దావూద్, కట్ల చారి తదితరులు రైతులు పాల్గొన్నారు.
1 thought on “మిర్చి పంటకు చట్టబద్ధత కల్పించాలి ”