స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి

స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి

స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి

మహాదేవపూర్, జులై 29, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటి పెళ్లిలో మంగళవారం ఉదయం ఒక ప్రైవేటు స్కూల్ వ్యాన్ కిందపడి మూడేళ్ల చిన్నారి అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన పలువురి హృదయాలను కదిలించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి… మహదేవపూర్ మండలం అంబటి పెళ్లి లో ఒక ప్రైవేటు స్కూలు కు చెందిన వ్యాను పిల్లలను ఎక్కించుకొని సూరారం వైపునకు వెళుతున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. సింగనవేని మల్లేష్, భాగ్య దంపతులకు చెందిన మూడేళ్ల చిన్నారి శ్రీహర్షిని మృత్యువాత పడింది. తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చి అసువులు బాసింది. తన అన్నను బస్సు ఎక్కించిన ఆ బస్సు టైర్ల కిందనే తల పగిలి నుజ్జునుజ్జు అయి ప్రాణాలు విడిచింది. చిన్నారి శ్రీహర్షిని మృతదేహం పలువురిని కంటతడి పెట్టించింది.ఈదుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment