భూపాలపల్లి జిల్లాలో 8న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

On: February 5, 2026 4:41 PM

భూపాలపల్లి జిల్లాలో 8న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

భూపాలపల్లి జిల్లాలో 8న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, ఫిబ్రవరి 5 (తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, విద్యుత్, అగ్నిమాపక, దేవాదాయ, డీఆర్‌డీఓ, ఎక్సైజ్, ఆర్‌డబ్ల్యూఎస్, రవాణా, ఆర్టీసీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనలో శాఖల వారిగా నిర్వర్తించాల్సిన విధులపై దిశానిర్దేశం చేస్తూ, హెలిప్యాడ్ వద్ద విద్యుత్ వైర్ల తొలగింపు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. కోటంచ, చెల్పూర్ హెలిప్యాడ్‌ల వద్ద అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది సిద్ధంగా ఉండాలని, అత్యవసర వైద్య సేవల కోసం కొడవటంచలో సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని తెలిపారు. చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే పబ్లిక్ మీటింగ్ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఆయుష్ ఆసుపత్రిలో సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని సూచించారు. హెలిప్యాడ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడం, అవసరమైన చోట్ల బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను ఆదేశించారు. సీఎం కాన్వాయ్‌కు అవసరమైన వాహనాల ఏర్పాటు, వాహనాల ఫిట్‌నెస్ తనిఖీలు, అనుభవజ్ఞులైన డ్రైవర్ల నియామకంపై రవాణా శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దేవాదాయ శాఖ కొడవటంచ ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, వీఐపీ ప్రోటోకాల్, పురోహితుల నియామకం చేయాలని, ఆలయ ప్రాముఖ్యతపై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. పబ్లిక్ మీటింగ్ ప్రాంగణంలో సైన్ బోర్డులు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, సిబ్బంది, వీఐపీ, వాహన పాసుల జారీపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మల్చూర్ నాయక్, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్వేత, ఆర్టీసీ డీఎం ఇందు, డీపీఓ శ్రీలత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!